Thursday, April 25, 2024

కోహ్లీకి కౌంటర్ ఇచ్చిన బ్రాడ్.. అవును లార్డ్స్ అండర్సన్ జాగీరే..!!

లార్డ్స్‌ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, పేస్ బౌల‌ర్ జేమ్స్ అండ‌ర్స‌న్ మ‌ధ్య మాట‌ల యుద్ధం జరుగుతోంది. నాలుగోరోజు ఆట‌లో భాగంగా అండ‌ర్స‌నే కోహ్లిని క‌వ్వించేలా మాట్లాడాడు. దీనికి విరాట్ త‌న‌దైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ నీ జాగీరేమీ కాదు అంటూ కోహ్లి చాలా ఘాటుగా స్పందించాడు. దీనికి సంబంధించిన వీడియోలో వైర‌ల్‌గా మారింది.


తాజా ఈ ఘటనపై ఇంగ్లండ్ మ‌రో పేస్ బౌల‌ర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ స్పందించాడు. ఈ మేరకు అతడు విరాట్ కోహ్లికి కౌంట‌ర్ వేశాడు. అవును.. లార్డ్స్ ఆండ‌ర్స‌న్ జాగీరే. కావాలంటే అక్క‌డి బోర్డు చూడు.. నీలోని ఫైర్ బాగుంది కానీ ఆ భాషే నిన్ను క‌ష్టాల్లో ప‌డేస్తుంది అని బ్రాడ్ ట్వీట్ చేశాడు. కాగా లార్డ్స్ టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులు మాత్రమే చేసింది.

ఈ వార్త కూడా చదవండి: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు శుభవార్త

Advertisement

తాజా వార్తలు

Advertisement