Saturday, April 20, 2024

రామ్ చరణ్ శంకర్ సినిమాలో తమన్నా ?

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై అంచనాలు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కీయారా అద్వానీ నటిస్తుండగా… మరో హీరోయిన్ గా తమన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కాకపోతే తమన్నా విలన్ భార్య గా కనిపించనుందట. హీరోయిన్ కి సమానంగా తమన్నా పాత్ర కూడా ఉంటుందట. ఇప్పటికే తమన్నా, రామ్ చరణ్ రచ్చ సినిమాలో నటించారు. అలాగే మరో బాలీవుడ్ స్టార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని… 20 నిమిషాల నిడివి కలిగిన ఆ పవర్ఫుల్ పాత్ర సినిమాకు చాలా కీలకమైనదని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement