Sunday, May 12, 2024

Followup : జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజే మ‌ర్డ‌ర్‌పై సర్వత్రా దిగ్భ్రాంతి..

జపాన్‌ మాజీ ప్రధాని షింజే అబే గురువారంనాడు కాల్పులకు గురైన మరణించడం అత్యంత విషాదకరం.ఆయన ప్రాణాన్ని నిలబెట్టేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దేశంలో ఆయనకు ప్రత్యర్ధులు లేరుఆయన హత్య ఊహకందని విషయం.సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది. ఆయన జనాదరణ పొందిన నాయకుడు.ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదా అన్నమాటలే ఇందుకు నిదర్శనం.అబే నుంచి తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నాననీ,ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని కిషిదా అన్నారు.జపాన్‌లో ఆర్థిక సుస్థిరత కోసం షింజే అబే ఎంతోకృషి చేశారు.ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి కోసం పాటు పడ్డారు.ఆయన జపాన్‌కి రెండు సార్లు ప్రధానిగా వ్యవహరించారు.ఆయన తాత నోబుషికే ప్రధానిగానూ తండ్రి షింటారో అబే విదేశాంగ మంత్రిగానూ పని చేశారు. అబే హయాంలో ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలను పటిష్టం చేయడానికి ఎంతో కృషి చేశారు. మన దేశంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.అయితే,ఆయన ముక్కు సూటితనమే ప్రాణం మీదికి తెచ్చిందేమోనని అనుమానిస్తున్నవారున్నారు.తైవాన్‌ విషయంలో చైనాదూకుడును ప్రదర్శిస్తే, అమెరికా,జపాన్‌లు చూస్తూ ఊరుకోవని ఆయన ఓ సందర్భంలో హెచ్చరించారు.అంతేకాకుండా, వాణిజ్యం విషయంలో చైనా అనుసరిస్తున్న విధానాలను ఆయన పలు సందర్భాల్లో విమర్శించారు.షింజే అబే అమెరికా,ఆస్ట్రేలియా, తదితర దేశాలకు సన్నిహితంగా ఉండటం చైనాకు కంటగింపుగా ఉండేది.చైనాపొరుగు దేశాల భౌగోళిక సరిహద్దులను దాటి ఆక్రమణ ధోరణిని ప్రదర్శించడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు.

జపాన్‌లో ఆయుధ సంస్కృతి అమెరికాతో పోలిస్తే తక్కువే.అయితే,అబేపై కాల్పులు జరిపిన వ్యక్తిని పొడవాటి దేశీయ తుపాకీనిప్రయోగించినట్టు ప్రాథమికవార్తలు సూచిస్తున్నాయి.ఆదివారం జరగనున్న ఎన్నికలకు లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్ధి తరఫున టోక్యోకి పశ్చిమాన 300 మైళ్ళ దూరంలో నారా నగరంలో ప్రచారానికి ఆయన వెళ్ళారు.ఆయనపై కాల్పులు జరిపిన వ్యక్తి పూర్వం సైన్యంలో పని చేశాడు.అతడు తన నేరాన్ని అంగీకరిస్తూనే,షింజే అబె విధానాలు నచ్చకపోవడం వల్లనే తాను కాల్పులు జరిపానని వాంగ్మూలం ఇచ్చాడు. షింజే అబే వి ధానాలకు దేశంలో పెద్ద వ్యతిరేకత లేదు.అయితే,పొరుగుదేశాల ప్రోద్బలంపై అతడు ఇంతటి దురాగతానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.జపాన్‌ రాజ్యాంగాన్ని మార్చడానికి ఆయన ఎక్కువగా కృషి చేశారు.దీంతో చైనా,దక్షిణ కొరియాలు ఆయనపై గుర్రు పెంచుకున్నాయి.అంతేకాకుండా దక్షిణ చైనా సముద్రంలో దీవుల విషయంలో ఆయన కరుకుగా వ్యవహరించారు.ఆ దీవులన్నింటినీ కైవసం చేసుకోవాలని చైనా ప్రయత్నాలు సాగించింది.ఇప్పటికీ సాగిస్తోంది. చైనా ప్రయత్నాలను ప్రతిఘటించడంలో వియత్నాం,తదితర దేశాలకు జపాన్‌ అండగా నిలిచింది.దాంతో జపాన్‌పై చైనా కక్ష పెంచుకుంది.వాణిజ్యం విషయంలోకూడా జపాన్‌ తమకు పోటీగా తయారైందనే భావన చైనా,దక్షిణ కొరియాలకు ఏర్పడింది. అలాగే,ఉక్రెయిన్‌పై రష్యాదాడిని జపాన్‌ ఖండించింది. ఈ దాడివల్ల పొరుగు దేశాల విశ్వసనీయతను కోల్పోనవల్సి వస్తుందని షింజే అబే రష్యాను హెచ్చరించారు.అమెరికా ,భారత్‌,దక్షిణాఫ్రికాలతో కలసి చైనాకు వ్యతిరేకంగా క్వాడ్‌ని ఏ ర్పాటు చేయడంలో షింజే అబే కీలక పాత్ర వహించారు.ఆయనపై చైనా గుర్రు పెంచుకోవడానికి అది కూడాఒక కారణం.షింజే అబే హత్య పట్ల అన్నిదేశాలూ తీవ్ర దిగ్భ్రాంతినీ,విచారాన్ని వ్యక్తం చేశాయి. జపాన్‌కి పెద్ద ఎగుమతిదారు. చైనాకు జపాన్‌ ఎగుమతులు గడిచిన 25 సంవత్సరాల్లో 6.3 శాతం పెరిగాయి.2020లో చైనాకు జపాన్‌ ఎగుమతులు 133బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. 1995లో జపాన్‌ ఎగుమతులు151 బిలియన్‌ డాలర్లు ఉండేవి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం తగ్గడానికి యుద్ధ నేరాల గుర్తింపు విషయంలో వచ్చిన మనస్పర్ధలే.చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ వల్ల ఇరుదేశాలమధ్య స్పర్దలు పెరిగాయి.నరేంద్రమోడీ ప్రధానిగా వచ్చిన తర్వాత జపాన్‌తో సంబంధాలు క్రమంగా మెరుగు అవుతున్నాయి.అంతకుముందు 11 బిలియన్‌ డాలర్లుమాత్రమే ఉన్నవాణిజ్యం రెండేళ్ళ క్రితం 18 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.భారత్‌తో ద్వైపాక్షిక,వాణిజ్య సంబంధాలను వృద్ధి చేసుకునేందుకు షింజే అబే ఆసక్తి చూపారు.ఆయన భారత్‌తో సన్నిహితంగాఉండం చైనా గుర్రుకుకారణాల్లో ఒకటి.అంతేకాకుండా ఆగ్నేయాసియాదేశాలతో వాణిజ్యం పెంచుకునేందుకు భారత్‌కి షింజే ఎంతో తోడ్పడ్డారు.జపాన్‌ ప్రాబల్యం పెరగడాన్ని చైనా ఒక దశలో తట్టుకోలేకపోయింది.షింజే అబేకి అంతశ్శత్రువుల కన్నా బాహ్య శత్రువులే ఎక్కువమంది ఉన్నారు.ఆయన హత్యను ఆ కోణం నుంచే చూడాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement