Tuesday, May 14, 2024

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్‌.. ఆఫ‌ర్ల పండుగ షురువ‌య్యింది

దేశంలోనే అతిపెద్ద ఆన్ లైన్ ఈ-కామర్స్‌ సంస్థల‌లో ఒక‌టైన‌ ఫ్లిప్ కార్ట్.. మరో సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఫ్లిప్ కార్ట్ “బిగ్ సేవింగ్ డేస్‌” పేరుతో మరో సారి సేల్ ను ప్రారంభించింది. జూన్ 10వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సేల్ ను జూన్ 14వ‌ తేదీ వరకు నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు సాగే ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వస్తువులపై పెద్ద మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తుంది ఫ్లిప్ కార్ట్.

ఈ సేల్ ద్వారా ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23, పోకో ఎక్స్ 5 తో పాటు మరొకొన్ని స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లను అందిస్తుంది. ప్రస్తుతం ఐఫోన్ 13 128 జీబీ స్టోరేజ్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ. 58,749 లుగా ఉంది. అయితే ఎస్బీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేసినట్లయితే అదనంగా రూ. 750 డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 57,999 లకు లభిస్తుంది.

- Advertisement -

అలాగే.. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 13,499 ధరకే లభిస్తుంది. ఈ ఏడాది మార్చిలో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 17,499 ధరకు కంపెనీ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సేల్ లో పోకో ఎక్స్ 5 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 15,999 ధరకు అందుబాటులో ఉంది. పైన తెలిపిన బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డుల ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 14,999 లకే లభిస్తుంది. అలాగే శాంసంగ్ కి చెందిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయిన గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్ ఫోన్ రూ. 10,999 లకు, అదే విధంగా శాంసంగ్ గెలాక్సీ ఎం14 స్మార్ట్ ఫోన్ రూ. 14,327 ధరకు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement