Tuesday, May 14, 2024

Blue Whale – స‌ముద్రతీరంలో 5 ట‌న్నుల‌ బ్లూవేల్ .. ఆస‌క్తిగా తిల‌కిస్తున్న జ‌నం

శ్రీకాకుళం జిల్లాలో ఓ అరుదైన బ్లూ వేల్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. సంతబొమ్మాళి మండలం పాత మేఘవరం వద్ద ఇది తీరంలో పడి ఉండడంతో స్థానికులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇది 25 అడుగుల పొడవు, 5 టన్నుల బరువుంటుందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.

కాగా, నీలి తిమింగలాలు బంగాళాఖాతంలో ఎంతో అరుదుగా కనిపిస్తుంటాయి. ఇవి గరిష్ఠంగా 98 అడుగుల పొడవు పెరుగుతాయి. దాదాపు 100 టన్నులకు పైగా బరువుంటాయి. ఒక పెద్ద నీలి తిమింగలం 33 ఏనుగుల బరువుకు సమానంగా ఉంటుందని అంచనా. నీటిలోనూ, భూమ్మీద ఇదే అతి పెద్ద జీవి. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఒడ్డుకు కొట్టుకొచ్చిన నీలి తిమింగలం చాలా చిన్నద‌ని చెబుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement