Saturday, May 25, 2024

బెంగళూరులో తొలి ఏసీ టెర్మినల్..

దేశంలోనే తొలి సెంట్రలైజ్డ్ ఏసీ రైల్వే టెర్మినల్‌ బెంగళూరు సిటీలో ఏర్పాటుయింది. దేశంలోనే తొలి ఏసీ రైల్వే టెర్మినల్ గా ఇది గుర్తింపు పొందనుంది. అత్యాధునిక వసతులు, టెక్నాలజీతో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ అత్యాధునిక రైల్వే స్టే‌షన్‌కు ప్రముఖ సివిల్‌ ఇంజినీర్‌, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు పెట్టారు. 314 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులు, సాంకేతికతతో ఈ రైల్వే టెర్మినల్‌‌ను నిర్మించారు. ఈ టెర్మినల్‌ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ట్విటర్ వేదికగా ఆయన దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.

బయ్యప్పన్‌హళ్లిలో ఏర్పాటు చేసిన ఈ రైల్వే స్టేషన్‌ ద్వారా బెంగళూరు నగరానికి మరిన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అనుసంధానం చేయనున్నారు. 4,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ టెర్మినల్‌ను నిర్మించారు. టెర్మినల్‌లో మొత్తం 7 ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ ద్వారా రోజూ 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. స్టేషన్ కు అనుసంధానంగా 250 వరకు కార్లు, 900 బైక్‌లు పార్కింగ్‌ చేసుకునేందుకు వీలుంది. క్లాస్ వెయిటింగ్‌ హాల్‌, వీఐపీ లాంజ్‌, ఫుడ్‌ కోర్టు, ఎస్కలేటర్స్‌, లిఫ్టులు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, రెండు సబ్‌వేలు తదితర సదుపాయాలు ఉన్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement