Friday, April 26, 2024

పెట్రో ధరల నియంత్రణకు ఎక్సైజ్ సుంకం తగ్గించాం.. ఎంపీ నామా ప్రశ్నలకు కేంద్రమంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో పెట్రోల్ ధరలను నియంత్రించేందుకు పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ద్రవ్యోల్బణం తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. దేశంలో అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతూ సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా గత ఐదేళ్లలో చారిత్రాత్మకంగా అసాధారణరీతిలో పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచడం వాస్తవం కాదా అని కేంద్రాన్ని లిఖితపూర్వకంగా నిలదీశారు.

పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో వివరించాలని కోరారు. ఆయన ప్రశ్నలకు కేంద్రమంత్రి రామేశ్వర్ తేలి సమాధానమిచ్చారు. పెట్రో ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో సంబంధిత ఉత్పత్తుల ధరలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. అధిక అస్థిరత, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా చాలా దేశాలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement