Friday, April 26, 2024

కోపంలో ఉన్నా.. బాధ‌లో ఉన్నా.. వర్కౌట్స్ చేస్తా.. ర‌ష్మిక మంద‌న‌

తెలుగు..త‌మిళ్..హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది ర‌ష్మిక మంద‌న‌. తాజాగా ఈ అమ్మడు ఫిట్ నెస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది రష్మిక.

తనకు సంబంధించిన ఏ విషయానైనా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది . తాజాగా ఫిట్నెస్ గురించి ఫిలాసఫీలు చెబుతూ వర్కౌట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను అభిమానులకు తెలిపింది ఈ నేషనల్ క్రష్.తాను ఎలాంటి మూడ్ లో ఉన్న జిమ్ లో వర్కౌట్స్ చేయడం వల్ల సంతోషం కలుగుతుందని అంటుంది రష్మిక. తాను కోపంలో ఉన్న.. బాధలో ఉన్న సరే వర్కౌట్స్ మాత్రం తప్పకుండా చేస్తానని ఇలా వర్కౌట్ చేయడం వల్ల ఆ బాధ నుంచి తొందరగా బయటపడతానని తెలియజేశారు. ఇలా వర్కౌట్స్ చేయడం వల్ల ఫిట్ గా ఉండటమే కాదు మనసుకు కూడా హాయిగా ఉంటుందని అంటుంది రష్మిక. మీరుకూడా ఇలా వర్కౌట్స్ చేయండంటూ సలహాలు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement