Sunday, May 19, 2024

రైటర్ పద్మభూషణ్ చూసి ఎంజాయ్ చేశా.. మహేశ్ బాబు

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకి..ఆదరణ పెరుగుతోంది. హీరో ఎవరనేది పక్కన పెడితే కథ ఇంపార్టెంట్ చూస్తున్నారు జనం. కాగా చిన్న సినిమాగా వచ్చిన రైటర్‌ పద్మభూషణ్ సినిమాపై సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ప్రశంసలు కురిపించారు. రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్‌ చేశానన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌ అద్భుతంగా ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. సుహాన్‌ నటన బాగుంది. దర్శకుడు ప్రశాంత్ షణ్ముఖ్‌, నిర్మాత అనురాగ్‌మై రెడ్డితో పాటు చిత్రబృందానికి అభినందనలు అంటూ రైటర్‌ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. రోజు రోజుకు ఈ సినిమా టిక్కెట్లు భారిగా తెగుతూనే ఉన్నాయి. ఇక్కడే అనుకుంటే యూఎస్‌లోనూ ఈ సినిమా పర్‌ఫార్మెన్స్‌ బాగుంది. ఇప్పటికే ఈ సినిమా యూఎస్‌లో 2లక్షల డాలర్‌లు వసూలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement