Monday, September 20, 2021

ఓవల్ టెస్టులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

ఓవల్ వేదికగా టీమిండియాతో జరుగనున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. ఈ టెస్టులో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఇషాంత్ స్థానంలో ఉమేష్ యాదవ్, షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్ తుదిజట్టులోకి వచ్చారు. అటు ఇంగ్లండ్ టీమ్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. బట్లర్ స్థానంలో పోప్, శామ్ కరణ్ స్థానంలో క్రిస్ వోక్స్‌ను రూట్ సేన తీసుకుంది.

భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానె, పంత్ (వికెట్ కీపర్), జడేజా, శార్దుల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, బుమ్రా, సిరాజ్.
ఇంగ్లండ్: ఆర్.బర్న్స్, హసీబ్ హమీద్, మలాన్, జో రూట్ (కెప్టెన్), పోప్, బెయిర్ స్టో (వికెట్ కీపర్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఓవర్టన్, అండర్సన్, రాబిన్‌సన్

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News