Friday, April 26, 2024

TS | రేప‌టి నుంచి ఎడిట్ ఆప్ష‌న్.. గ్రూప్‌-1 తప్పుల సవరణకు అవకాశం

తెలంగాణ రాష్ట్రంలో 60 కొత్త పోస్టులతో మొత్తం 563 గ్రూప్-1 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించింది. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష, అక్టోబర్ 21న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా, గ్రూప్-1 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం క‌ల్పించారు.. ఈ ఎడిట్ ఆప్షన్‌ను శనివారం (రేపు) ఉదయం 10 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉపయోగించుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ శుక్రవారం ప్రకటించారు. గ్రూప్-1 ఉద్యోగాల కోసం చేసిన దరఖాస్తుల్లో పేరు, పుట్టిన తేదీ, జెండ‌ర్, విద్యార్హతలు, ఫొటో, సంతకం వంటి తప్పులుంటే సరిదిద్దుకోవచ్చని పేర్కొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement