Sunday, May 19, 2024

ఫరూఖ్‌ అబ్దుల్లాపై ఈడీ చార్జ్‌షీట్‌.. జెకెసీఏలో ఆర్థిక అవకతవకలపై కేసు

మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లాపై ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ మంగళవారం చార్జ్‌ షీట్‌ నమోదు చేసింది. జమ్ముకశ్మీర్‌కు ఫరూక్‌ అబ్దుల్లా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో జమ్ము కశ్మీర్‌క్రికెట్‌ అసోసియేషన్‌ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపనలపై ఈడీ ఫరూక్‌ అబ్దుల్లా పై మనీల్యాండరిగ్‌ కేసు నమోదు చేసింది. క్రికెట్‌ అసోసియేషన్‌ సొమ్మును వ్యక్తుల ప్రైవేట్‌ ఖాతాలకు బదిలీ చేసిందని, అసోసియేషన్‌ ఆఫ్‌స్‌ బేరర్స్‌ ఖాతాలకు కూడా మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది. దీనిపై ఫరూఖ్‌ అబ్దుల్లాను పలుమార్లు ఈడీ ప్రశ్నించింది.

మే 31న శ్రీనగర్‌లో మాజీ సీఎం ఫరూఖ్‌ను ఈడీ ప్రశ్నించింది. మంగళవారం ఆయనపై చార్జ్‌ షీట్‌ నమోదు చేసింది. బీసీసీఐ స్పాన్సర్‌ చేసిన నిధులను క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి హోదాలో ఫరూఖ్‌ దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపించింది. ఈడీ చార్జ్‌షీట్‌ను అబ్దుల్లా కండించారు. అసెంబ్లి ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయ నాయకులపై ఈడీ దాడులు చేస్తూనే ఉంటుందని ఫరూఖ్‌ విమర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement