Sunday, May 19, 2024

Punjab High Court : కుక్క కరిస్తే రూ.20వేల పరిహారం ప్రభుత్వమే చెల్లించాలి…

కుక్కల దాడులకు సంబంధించిన ఓ కేసులు పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వీధి శునకాలు, ఇతర జంతువుల దాడి కేసులో పరిహారం చెల్లించాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పంజాబ్- హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది.

ప్రభుత్వ విభాగం లేదా ప్రైవేటు వ్యక్తుల నుంచి రికవరీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది అని హైకోర్టు ధర్మాసనం తీర్పులో పేర్కొంది. కుక్క కాటుకు గురైన వ్యక్తికి ఒక్కో పంటి గాటుకు కనీసం రూ.10వేలు చెల్లించాలని, గాయం తీవ్రమైనదైత.. (0.2 సెం.మీ మేర కోతపడినట్లయితే) రూ.20వేల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement