Tuesday, October 8, 2024

Delhi | ఎస్సీ వర్గీకరణ చేపట్టవద్దు.. కేంద్రానికి మాలమహానాడు వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టవద్దని మాలమహానాడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన నాయకులు ఢిల్లీలో ధర్నా చేపట్టారు. అనంతరం కేంద్రమంత్రులు రాందాస్ అథవాలే, పశుపతి కుమార్ పరాశీని కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ చేపట్టట్లేదని, దీనికి దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదని కేంద్రమంత్రి రాందాస్ చెప్పారని మాలమహానాడు బృందం తెలిపింది. అనంతరం వారు ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement