Saturday, April 27, 2024

మామిడి పండు తింటున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

పండ్లలో రాజు మామిడి పండు. వేసవి కాలంలో పుష్కలంగా దొరికే ఈ మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కేవలం ఎండా కాలంలో రెండు నెలల పాటు దొరికే ఈ పండ్లను ఇష్టపడని వారుండరు. నోరూరించే పండును చూడగానే లటుక్కున అందుకుని పసపసా తినేస్తాం. ఫలాల్లో రాజు అయిన ఈ పండు వేసవిలోనే విరివిగా లభిస్తుంది. మామిడికి నాలుగు వేల ఏళ్ల చరిత్ర వుంది. ఇది భారతదేశపు జాతీయఫలం. వీటిని తింటే శరీరానికి కెరోటిన్, విటమిన్ సి, కాల్షయం పుష్కలంగా లభిస్తాయి. అంతాబాగానే ఉంది కానీ మామిడి పండు తిన్న తర్వాత చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

✤ మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగొద్దు. అలా తాగితే కడుపునొప్పి వస్తుంది. ఎసిడిటీ కూడా వస్తుంది. అందుకే మామిడి పండు తిన్న అరగంట దాకా గానీ నీళ్లు తాగొద్దు
✤ ఇక కొందరు మామిడి పండు, పెరుగన్నంలో కలుపుకుని తింటారు. అలా అస్సలు చేయొద్దు. ఎందుకంటే…మామిడి పండు తింటే వేడి చేస్తుంది, పెరుగు తింటే చల్లదనం ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తింటే మన కడుపుకు కోపమొస్తుంది. లేనిపోని స్కిన్ సమస్యలు వస్తాయి. టాక్సిన్స్ కూడా వచ్చే ఛాన్సుంది
✤ మామిడి పండు తిన్న తర్వాత… ఒకవేళ ఆరోజు మీ ఇంట్లో కాకరకాయ కూర చేసి ఉంటే… దాన్ని అస్సలు ముట్టుకోకండి. పండు తిన్నతర్వాత కాకరకాయ కూర వేసుకుని అన్నం తింటే వికారం, వాంతులు అవుతాయి. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు వస్తాయి
✤ అన్నంటికంటే ముఖ్యం మామిడి పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్స్ అస్సలు తాగొద్దు. అలా తాగితే… మన బాడీలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో మనకు షుగర్ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement