Thursday, March 28, 2024

నాగ్ సినిమాలో మరో జబర్దస్త్ యాంకర్!!

జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందంతో అభినయంతో బుల్లితెరపై నటిస్తూనే మరోవైపు వెండితెర పై కూడా మెరుస్తూ ఉంది. గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమాలో తన అందచందాలతో ప్రేక్షకులను మైమరిపించింది. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరోసారి రష్మి నటించబోతోంది.

అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు ఓ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో రష్మీ కూడా కీలక పాత్రలో కనిపించనుందట. ఇప్పటికే ప్రవీణ్ సత్తార్ కథ చెప్పడంతో రష్మి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్పీ ,నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement