Saturday, April 27, 2024

తెలంగాణకు డిజిటల్ ఇండియా అవార్డ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ ఇండియా అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం ఒక అవార్డు గెలుచుకుంది. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాల్లో తీసుకొచ్చిన డిజిటల్ విధానాలకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులకు ఎంపిక చేయగా, విజేతలకు శనివారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు ప్రదానం చేశారు. మొత్తం 7 కేటగిరీల్లో అవార్డులకు ఎంపిక చేయగా, ప్రతి కేటగిరీలో మొదటిస్థానంలో నిలిచినవారికి ప్లాటినం, 2వ స్థానంలో నిలిచినవారికి గోల్డ్, 3వ స్థానంలో నిలిచినవారికి సిల్వర్ అవార్డులను అందజేశారు. ఇందులో ‘డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ కొలాబరేషన్ విత్ స్టార్టప్స్’ కేటగిరీలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో నిలిచి గోల్డ్ అవార్డు అందుకుంది. ‘స్మార్ట్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ది సాయిల్’ పేరుతో చేపట్టిన కార్యక్రమం ఈ అవార్డుకు ఎంపికైంది.

డిజిటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ సిటిజన్స్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వ ఈ-నామ్ వ్యవస్థ ప్లాటినం అవార్డు అందుకోగా, డిజిటల్ ఇనీషియేటివ్స్ ఎట్ గ్రాస్‌రూట్స్ లెవెల్ విభాగంలో మధ్యప్రదేశ్‌కి చెందిన ఈ-వివేచన యాప్ ప్లాటినం అవార్డు గెలుచుకుంది. ఈ విభాగంలో రెండవ స్థానంలో జార్ఖండ్, మూడవ స్థానంలో కేరళ నిలిచాయి. డిజిటనల్ ఇనీషియేటివ్స్ ఫర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేటగిరీలో ఉత్తర్  ప్రదేశ్‌కి చెందిన మైన్ మిత్ర ప్లాటినం అవార్డు గెలుచుకుంది. తర్వాతి స్థానంలో ఒడిశాకు చెందిన ఈ-అబ్కారీ నిలిచింది. ఇన్వెస్ట్ పంజాబ్ మూడవ స్థానంలో ఉంది. మొత్తంగా 7 విభాగాల్లో కేరళ రాష్ట్రం 3 విభాగాల్లో అవార్డులు గెలుచుకుని మొదటిస్థానంలో నిలిచింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement