Monday, May 6, 2024

ధ‌మ్ కీ కోసం పాట పాడిన.. ఆర్ పీ ప‌ట్నాయ‌క్

ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ క‌థ అందిస్తున్న చిత్రం ధ‌మ్ కీ.ఈ చిత్రాన్ని యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ స్వీయ దర్శకత్వంలో తెర‌కెక్కుతోంది.. ధమ్‌ కీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రావు రమేశ్, పృథ్విరాజ్‌, హైపర్‌ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కామెడీ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథనందిస్తున్నాడు.కాగా ధమ్‌కీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కమ్‌ సింగర్ ఆర్‌పీ పట్నాయక్‌ ధమ్‌కీలో ఓ ఎమోషనల్‌ సాంగ్ పాడారట.లియోన్‌ జేమ్స్ కంపోజిషన్‌లో ఆర్‌పీ పట్నాయక్‌ పాట ఉండబోతుందని తెలియజేస్తూ.. ఆయనతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌ స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్ చేశాడు విశ్వక్ సేన్‌. సాంగ్‌ రికార్డింగ్ కూడా పూర్తయిందని తెలిపారు. ధమ్‌కీ ఫిబ్రవరి 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement