Tuesday, May 7, 2024

దుమ్మురేపిన రవితేజ..అదిరిన ధమాకా టీజర్

మాస్ కి పెట్టింది పేరు హీరో రవితేజ.తనలోని మాస్ ని మరోసారి బయటికి తీశాడు. ఈయన నటిస్తోన్న తాజా చిత్రం ధమాకా.. త్రినాథ్ రావు నక్కిన ద‌ర్శకత్వం వ‌హిస్తున్నాడు.ఈ చిత్రంలో ర‌వితేజ‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తుంది.యాక్షన్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజ‌వాడ క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు అందిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ధమాకా క్రాకర్‌ అంటూ టీజర్‌ను రిలీజ్‌ చేసింది.ఈ టీజర్‌లో మాస్‌రాజ చెప్పే డైలాగ్స్, యాక్షన్ స్టంట్స్ ఫుల్‌ ఎనర్జీతో వేరే లెవల్లో ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఇంత ఎనర్జిటిక్‌ పాత్రలో రవితేజ నటించినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రంలో రవితేజ రెండు విభిన్న గెటప్స్‌లో ఒకటి క్లాస్‌, మరొకటి మాస్‌ గెటప్‌లో కనిపిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియలో నేపథ్య సంగీతం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 23న రిలీజ్‌ చేయనున్నట్లు టీజర్‌లో ప్రకటించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement