Monday, April 29, 2024

rescue operation: చివ‌రి ద‌శ‌లో ట‌న్నెల్ రెస్క్యూ ఆప‌రేష‌న్… మ‌రికొన్ని గంట‌ల‌లో బ‌య‌ట‌కు రానున్న కూలీలు

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు మ‌రికొన్ని గంట‌ల‌లో బ‌య‌ట‌కు రానున్నారు.. ఆమెరికా నుంచి తీసుకొచ్చిన భారీ డ్రిల్ల‌ర్ సాయంతో గనిలో చిక్కుకుపోయిన వారి వ‌ద్ద‌కు పైప్ లైన్ ను విజ‌య‌వంతంగా వేశారు.. ఈ పైప్ లైన్ ద్వారా ఒక్కొక్క‌రిని తీసుకురానున్న‌ట్లు ఈ రెస్క్కూ ఆప‌రేష‌న్ క‌మాండ‌ర్ ప్ర‌క‌టించారు.

అయ‌తే దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పారు..కాగా, గురువారం ఉదయం 8 గంటలకే కార్మికులను బయటకు తీసుకురావాల్సి ఉండగా, తవ్వకాల సమయంలో శిథిలాలు అడ్డు రావడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది.
రెస్క్యూ ఆపరేషన్‌లో ఉపయోగిస్తున్న భారీ యంత్రాలు, కంప్రెసర్ యంత్రాల యజమాని శైలేష్ గులాటీ మీడియాతో మాట్లాడారు. కార్మికుల దగ్గరకు చేరేందుకు చేస్తున్న తవ్వకాల్లో ఐదారు మీటర్ల మేరకు తవ్వాల్సి ఉండగా, ఇనుప శిధిలాలు అడ్డుపడటంతో పనులను ఆపాల్సి వచ్చిందన్నారు. శిథిలాలలో ఇనుప పైపులు, రాడ్లు ఉన్నాయన్నాయన్నారు. వీటిని తొలగించి, కార్మికుల దగ్గరకు చేరుకునేందుకు సాంకేతిక సాయాన్ని అందించేందుకు ఢిల్లీ నుంచి నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంద‌ని, ప్ర‌స్తుతం ఆడ్డుగా ఉన్న వాటిని తొల‌గించామ‌ని చెప్పారు.. దీంతో గ‌నిలో చిక్క‌కున్న వారికి బ‌య‌ట ప్ర‌పంచంతో సంబంధాలు ఏర్పడ్డాయన్నారు. లోపల చిక్కుకున్న కార్మికులతో మాట్లాడుతున్నామని, ఆహారం అందించడానికి అమర్చిన పైపు ద్వారానే సంభాషణ జరుగుతున్నదని శైలేష్ గులాటీ తెలిపారు. కూలీలకు పూర్తిస్థాయిలో ఆహారం అందిస్తున్నామని, ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ మాత్రమే పంపించామని అధికారులు తెలిపారు. కాగా ఈ నెల 12న ఈ ప్రమాదం జరిగింది. అందులో ప‌ని చేస్తున్న 41 మంది కూలీలు చిక్కుకుపోయారు.. ఆ రోజు నుంచి వారికి వివిద ప‌ద్ద‌తుల‌లో ఆహారం, మంచినీరు, ఆక్సిజెన్ అందిస్తున్నారు.. మొత్తం 41 మంది కూలీలు సుర‌క్షితంగా ఉన్నార‌ని అధికారులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement