Sunday, April 28, 2024

NZB : సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం…. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్

బిక్కనూర్, నవంబర్ 23 (ప్రభ న్యూస్) సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. గురువారం మండలంలోని బస్వాపూర్, భగీరత్ పల్లి, ఈసన్నపల్లి ,కంచర్ల, మల్లుపల్లి ,గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఇక్కడి నుండి పోటీ చేస్తున్నారని తెలిపారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు.

మూడవసారి అధికారంలోకి రాగానే మరిన్ని పథకాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు వేస్తే గ్రామాలు అంధకారంగా మారుతాయని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అందిస్తే కాంగ్రెస్ నాయకులు ఎందుకని ఎద్దేవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి మూడు గంటల కరెంటు మాత్రమే ఇస్తానని చెప్పారు. దానికి కూడా మీటర్లు పెట్టి కరెంటు బిల్లు వసూలు చేస్తారన్నారు. రైతాంగానికి వ్యవసాయ పెట్టుబడి కింద ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని 16 వేలకు పెంచడం జరుగుతుందని గుర్తు చేశారు. భారతదేశంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైనా గుజరాత్ లో 700 రూపాయలు పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. ఇక్కడ 2000 రూపాయలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు అధికారంలోకి రాగానే 4000 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. బీడీ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఆడపడుచులకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని సూచించారు. ఇప్పటికే సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. చిన్న గ్రామాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలన్నా ఉద్దేశంతో తాను పోటీ నుండి తప్పుకున్నట్లు చెప్పారు. స్వయానా సీఎం కేసీఆర్ ను పోటీ చేయాలని తాను కోరడం జరిగిందన్నారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. వారు ఇచ్చే డబ్బులు తీసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమలరెడ్డి, ఎంపీపీ గాల్ రెడ్డి, మండల భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు నరసింహారెడ్డి, మండల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ రామచంద్రం, సిద్ధి రామేశ్వర ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి ,మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు రాజమౌళి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ లింగాల కృష్ణ గౌడ్, వైస్ ఎంపీపీ యాదగిరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్, మండలం భారత రాష్ట్ర సమితి యువజన విభాగం అధ్యక్షులు రంజిత్ వర్మ ,ఆయా గ్రామాల సర్పంచులు మంజుల మల్లారెడ్డి, నాగలక్ష్మి ,గుడిసె రాములు, పల్లపు లలితా శంకర్, చంద్రకళ మాధవరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు లీలావతి బాలా గౌడ్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement