Monday, April 29, 2024

మన రహదారుల గతి ఇంతేనా?

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రహదారులు కలిగి ఉన్న దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో థాయిలాండ్​, అమెరికా ఉన్నాయి. నాలుగో స్థానంలో భారత్​ నిలిచింది. ఈ మేరకు ఇంటర్​నేషనల్​ డ్రైవర్​ ఎడ్యుకేషన్​ కంపెనీ జుటోబీ వెల్లడించింది. అత్యంత సురక్షితమైన రహదారులు ఉన్న దేశాల్లో నార్వే మొదటి స్థానంలో, జపాన్​ రెండో స్థానంలో ఉన్నాయి. మూడో స్థానంలో స్వీడన్ ఉంది. 56 దేశాలతో విడుద‌ల చేసిన జాబితాలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణించేవారి సంఖ్య, సీటు బెల్టు పెట్టుకుని కారు నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ లెక్క తేల్చారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన డేటా ఆధారణంగా ఆయా దేశాలకు ఈ ర్యాంకులు కేటాయించారు. కాగా జుటోబీ చేసిన ఈ అధ్యయనంపై ప‌లు దేశాలు అసంతృప్తి వ్య‌క్తం చేశాయి. పాత డేటా ఆధారంగా ఈ అధ్య‌య‌నం చేశార‌ని మండిప‌డుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement