Tuesday, May 14, 2024

‘డేంజరస్’ సినిమా ట్రైలర్ విడుదల.. త్వరలో సీఎం కేసీఆర్ బయోపిక్ తీస్తా : R.G.V

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : త్వరలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు బయోపిక్ తీస్తానని డైరక్టర్ రాంగోపాల్ వర్మ ప్రకటించారు. తాను రూపొందించిన సినిమా ‘డేంజరస్’ ట్రైలర్ విడుదల సందర్భంగా మాట్లాడిన వర్మ, కేసీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందన్నారు. ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘డేంజరస్’ చిత్రంలో నటించిన హీరోయిన్లు నైనా గంగూలీ, అప్సర రాణితో ట్రైలర్ కలిసి ట్రైలర్ విడుదల చేశారు. కేవలం 40 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 8 వతేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా తమ సినిమా కథను రూపొందించినట్టు తెలిపారు. సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కోరకమైన ఆలోచన, అభిరుచి ఉంటుందని, స్వలింగ సంపర్కం కూడా ఆకోవలోనిదేనని అన్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ల రేట్ల విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తమ సినిమాను థియేటర్లతో పాటు ఓటీటీలోనూ విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న కాశ్మీర్ ఫైల్స్ సినిమా తనకు బాగా నచ్చిందని వర్మ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement