Wednesday, May 15, 2024

ప్రస్తుతానికి పాత ధరలే.. ప‌వ‌ర్ ప‌ర్చేజింగ్‌లో ఆచితూచి అడుగులేస్తున్న డిస్కంలు

విద్యుత్‌ కొనుగోలు ధరలపై పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొనుగోలు వ్యయం పెరుగుతున్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇంధనశాఖ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నాయి. తద్వారా విద్యుత్‌ కొనుగోలు వ్యయం పెరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఈక్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో విద్యుత్‌ కొనుగోలు జరిగిన ఖర్చునే ఈఆర్థిక సంవత్సరం (2021-22)లో కూడా వర్తింపజేయాలని కోరుతున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి పంపిణీ సంస్థలు (ఈపీడీసీ ఎల్‌, సీపీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌) ప్రతిపాదనలు సమర్పించాయి. పంపిణీ సంస్థలు దీర్ఘకాలిక, స్వల్పకాలిక కొనుగోలు ఒప్పందాల ద్వారా ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంటాయి. ఇలా కొనే విద్యుత్‌ ధరలు ఒక్కో సంస్థకు ఒక్కో విధంగా ఉంటాయి.

పలు ఉత్పత్తి సంస్థలు యూనిట్‌ ధరను రూ.5.54 వరకూ నిర్ణయించి అమ్ముతున్నాయి. హైడల్‌ విద్యుత్‌ యూనిట్‌ రూ.1.58 పైసలకే లభిస్తుంది. కానీ దీని లభ్యత చాలా తక్కువ. ఈపరిస్థితుల్లో డిమాండకు సరి పడా విద్యుత్‌ను ఎక్కువ ధర చెల్లించైనా సమకూర్చుకుని వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత డిస్కంలపై ఉంది. ఈనేపథ్యంలో హెచ్చు తగ్గులతో ప్రమేయం లేకుండా ఎక్కడ విద్యుత్‌ దొరికితే అక్కడ కొను గోలు చేస్తున్నాయి. ఇలా కొనుగోలు చేసిన విద్యుత్‌ సగటు వ్యయం ఈపీడీ సీఎల్‌ యూనిట్‌ రూ.4.51గా, సీపీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌ యూనిట్‌ రూ.4.58గా నిర్ధారించాయి. తాము కొంటున్న విద్యుత్‌ ధరలను సంస్థల వారీగా కూడా డిస్కం లు ఏపీ ఈ ఆర్సీకి నివేదించాయి. ఈమొత్తం కొనుగోలు ఖర్చులకు 20 21-22 ఏడాది కూడా అనుమతించాల్సిందిగా మండలిని కోరాయి. డిస్కంలు సమర్పించిన లెక్కలు, ప్రతి పాదనలపై మార్చి 28న ఉదయం 11 గంటలకు వర్చువల్‌ విధానంలో ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుం ది. ఈ లోగా ఎవరైనా తమ అభ్యంతరాలను, సూచనలను ఏపీ ఈఆర్సీ ఈమెయిల్‌ [email protected]కు వంపవచ్చు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుని మండలి విచారణ చేపడుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement