Sunday, May 19, 2024

వైసీపీకి వ్యతిరేకత సెగ..అసహనంతోనే జనంపై ఎదురుదాడి: కనకమేడల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్యం పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని, అందుకే గడపగడపకు కార్యక్రమంలో ప్రజలు మంత్రులను, అధికారులను నిలదీశారని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత సెగ వైఎస్సార్సీపీ నేతలు గ్రహించారని, అదే వారిలో అసహనానికి కారణమవుతోందని అన్నారు. ఈ అసహనంతోనే ప్రజల మీద తిరుగుబాటు చేయమంటూ సీఎం జగన్ తన పార్టీ ప్రజా ప్రతినిధులకు చెప్పారని కనకమేడల ఆరోపించారు. ప్రజల మీదకి ఎమ్మెల్యేలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తమ పని అయిపోయిందని సీఎం సహా వైఎస్సార్సీపీ పార్టీకి ఎమ్మెల్యేలకు అర్థమైందని వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతు కోల్పోయమన్న అభద్రతాభావంలో ఉన్నారని సూత్రీకరించారు. ప్రజలు తమ సమస్యలు ప్రస్తావిస్తే సమాధానాలు చెప్పాలి, వీలుంటే పరిష్కారించాలి తప్ప ప్రజలపై తిరగబడమని చెప్పడమేంటని కనకమేడల ప్రశ్నించారు.

వైఎస్సార్సీపీ అవినీతి అరాచకత్వాన్ని కేంద్ర బీజేపి నేతలు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి బయట పెడుతున్నారని, కానీ ఢిల్లీలో ప్రధానితో, కేంద్ర మంత్రులతో వైఎస్సార్సీపీ నేతలు సాగించే మంతనాలను ఎందుకు బయటపెట్టడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ చేయని ప్రయత్నం లేదని అన్నారు. ఈ హత్య కేసులో నిందితులు, అనుమానితులు వరుసగా చనిపోతున్నారని, గతంలో పరిటాల రవి హత్య కేసులో కూడా ఇలాగే నిందితులు, అనుమానితులు చనిపోయారని గుర్తుచేశారు. సాక్షులు, నిందితులు, అనుమానితులను హతమార్చి కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement