Sunday, May 12, 2024

చైనాలో కరోనా.. ఆంక్షల గుప్పిట్లో 40కోట్ల మంది..

బీజింగ్‌: చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ చేయిదాటుతోంది. ప్రపంచంలో ఏ దేశంలో లేనివిధంగా అక్కడ కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి. ఇప్పటికే షాంఘైతోపాటు పలు నగరాల్లో పూర్తి లాక్‌డౌన్‌ అమలులో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో స్థానికంగా కొవిడ్‌ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. దీంతో ప్రస్తుతం చైనాలో 40కోట్ల మంది ఆంక్షల గుప్పిట్లో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కరోనా వైరస్‌ విజృంభణకు చైనా నగరాలు వణికిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలో షేన్‌రేన్‌లో తొలుత కొవిడ్‌ ఆంక్షలు మొదలుపెట్టారు. అప్పటి నుంచి తాజాగా షాంఘై వరకు ఆంక్షల క్రమం కొనసాగుతూనే ఉంది. గవేకాల్‌ డ్రాగొ నామిక్స్‌ అధ్యయనం ప్రకారం, చైనాలోని 100 ప్రధాన నగరాల్లో దాదాపు 87 చోట్ల కొవిడ్‌ కట్టడి ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సమాచారం.

ఇక నొమురా హూల్డింగ్స్‌ సంస్థ ఆర్థికవేత్తల నివేదిక ప్రకారం 37.3కోట్ల మంది ప్రజలు పలు రకాల కొవిడ్‌ ఆంక్షల్లో కొనసాగుతున్నట్లు అంచనా. షాంఘైలో గత రెండు వారాలుగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా, తాజాగా పొరుగు ప్రాంతమైన సుర&° ప్రావిన్సులోనూ ఆంక్షలు విధించారు. మరోవైపు షాన్‌షీ ప్రావిన్సు రాజధాని తైయువాన్‌లోనూ కొవిడ్‌ కట్టడి చర్యలు కఠినతరం చేస్తున్నారు. ప్రస్తుతం 53లక్షల జనాభా కలిగిన ఆరు జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించారు. ప్రముఖ వాణిజ్య నగరమైన గువాన్‌రలోనూ కొవిడ్‌ కట్టడి చర్యలు ఊపందుకున్నాయి. పాఠశాలలు మూసివేయడం, రద్దీ ప్రాం తాల్లో కొవిడ్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఐఫోన్‌ తయారీదారు పెగాట్రాన్‌ కార్పొ రేషన్‌ వంటి సంస్థలతోపాటు టెస్లా, నియో వంటి కార్ల తయారీ సంస్థలు మూతపడుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement