Wednesday, May 15, 2024

బీ అలర్ట్: పెరుగుతున్న డెల్టాప్ల‌స్ ఏవై3 వేరియంట్..

కరోనా సెకండ్ వేవ్ పూర్తిస్థాయితో తగ్గుముఖం పట్టనేలేదు..ఒకానొక దశలో సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు అంచనాలు కట్టారు. కాని ప్రతిరోజు 40 వేల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ  సెకండ్ వేవ్‌కు కార‌ణ‌మైన డెల్టావేరియంట్ మ్యూటేష‌న్‌లు చెంది డెల్టాప్ల‌స్ వేరియంట్ గా మార్పులు చెందింది.  ఈ డెల్టాప్ల‌స్ వైర‌స్‌లో కూడా ఏవై3, ఏవై3.1 కేసులు పెరుగుతున్నాయి.  వేరియంట్ కేసుల వ్యాప్తిని అడ్డుకోవాలంటే వేగంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు.  డెల్టాప్ల‌స్ వైర‌స్‌లో ఏవై3 ర‌కం కేసులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 17 వేల‌కు పైగా న‌మోద‌య్యాయ‌ని నిపుణులు చెబుతున్నారు.  భార‌త్‌లో ఏవై3 ర‌కం కేసులు 263 ఉన్నాయి.  వైర‌స్ మ్యూటేష‌న్ జ‌ర‌గ‌కుండా అడ్డుకోవాలంటే వీలైనంత వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రికి వ్యాక్సిన్ అందించాల‌ని, హెర్డ్ ఇమ్యూనిటీ కంటే వ్యాక్సిన్ అందించ‌డ‌మే ప్ర‌స్తుతానికి మేల‌ని సీసీఎంబీ పేర్కొన్న‌ది.  కేసులు త‌గ్గుతున్న‌ప్ప‌టికీ, ప‌రీక్ష‌ల‌ను త‌గ్గంచ‌వ‌ద్ద‌ని సీసీఎంబీ శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: తూ.గో.జిల్లాలో బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ సందడి

Advertisement

తాజా వార్తలు

Advertisement