Friday, April 19, 2024

తూ.గో.జిల్లాలో బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ సందడి

తూర్పుగోదావరి జిల్లాలో బాలీవుడ్ ప్రముఖ హీరో అమీర్ ఖాన్ సందడి చేస్తున్నాడు. అమీర్ ఖాన్ ప్రస్తుతం హిందీ మూవీ లాల్ సింగ్ చద్దాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం అమీర్ ఖాన్ ఏపీకి వచ్చాడు. కోనసీమలోని అల్లవరం ఓడలరేవు ప్రాంతాల్లో జరగబోయే సినిమా షూటింగ్‌లో అమీర్ ఖాన్ పాల్గొంటాడు. ఈ మేరకు అతడు కాకినాడ సరోవర్ పోర్టికో హోటల్‌లో బస చేశాడు. అమీర్ ఖాన్ ప్రైవేట్ సెక్యూరిటీ ఆధీనంలో హోటల్‌లో బస చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. ఆర్మీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంతకాలం ఈ సినిమా షూటింగ్ జమ్మూకాశ్మీర్ లడక్‌లో తీశారు. కాగా ఇటీవలే నాగచైతన్య షూటింగ్ పార్టును పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాడు. ఈ సినిమాలో కరీనా కపూర్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ప్రస్తుతం గోదావరి జిల్లాలో బాలీవుడ్ సినిమా షూటింగ్ జరగడంతో స్థానిక ప్రజలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. షూటింగ్‌ను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.

ఈ వార్త కూడా చదవండి: లూసీఫర్ రీమేక్‌లో సల్మాన్ ఖాన్ ?

Advertisement

తాజా వార్తలు

Advertisement