Monday, April 29, 2024

నూటొక్క జిల్లాల అందగాడు…రిలీజ్ డేట్ ఫిక్స్

అవసరాల శ్రీనివాస్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. దర్శకుడిగా, నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు అవసరాల శ్రీనివాస్. అయితే ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ రుహని శర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు. ఈ సినిమాకు రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తుండగా… దిల్ రాజు, క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. ఈనెల 27న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement