Friday, March 29, 2024

ఏపీ సర్కార్ ఆలోచనలు దరిద్రం: రఘురామ సెటైర్

ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం కాస్తా జగనన్న పరిపూర్ణ మద్యపాన దీవెనగా మారిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. మద్యపాన నిషేధం హామీ వల్ల జగన్ ముఖ్యమంత్రి అయ్యారని, కానీ ప్రజలు మద్యం తాగి చావమని సీఎం కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే కొద్ది మంది కల్తీ బ్రాండ్ల వల్ల చనిపోయారని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ఆలోచనలు దరిద్రంగా ఉన్నాయని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.

ఎయిడెడ్ కాలేజీలపై ఏపీ ప్రభుత్వం కన్ను పడిందని ఆరోపించారు. ఏపీ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్  పెట్టి.. దాని కింద ఎయిడెడ్ కళాశాలల ఆస్తులు చూపించి అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్ని కళాశాలలు ఆస్తులు అమ్మితే ఇంకో లక్ష కోట్లు వస్తాయని, ఇంకో ఏడాది నడుపుకోవచ్చుని అనుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలకు సహకరించవద్దని, లోన్లు ఇవ్వొద్దని బ్యాంకర్‌లను కోరారు.

ఇది కూడా చదవండి: బండి సంజయ్ పాదయాత్ర పేరు ఖరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement