Monday, May 13, 2024

12 రాష్ట్రాల్లో కరోనా ఉధృతి, వారం రోజుల్లో రెట్టింపు కేసులు..

దేశంలో కరోనా మెల్లగా విజృంభిస్తోంది. గతవారం రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య రెట్టింపయింది. 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో క్రియాశీల కేసుల సంఖ్య 16వేలు దాటింది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.02లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,541 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.84శాతంగా ఉంది. అదే సమయంలో 1,862 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.75శాతానికి పెరిగింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 16,522కి పెరిగాయి. మొత్తం కేసుల్లో వీటి శాతం 0.04గా ఉంది.

తాజాగా మరో 30 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు సంభవించిన మొత్తం కొవిడ్‌ మరణాలు 5,22,223కి చేరాయి. ఏప్రిల్‌ 18-24 మధ్య దేశవ్యాప్తంగా 15,700లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అంతక్రితం వారంలో ఈ సంఖ్య 8000 మాత్రమే. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆదివారం మరో 3.64లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు 187 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement