Wednesday, May 22, 2024

బండి సంజ‌య్ సీఎం అయితేనే రైతుల బాధ‌లు పోత‌య్.. మ‌క్త‌ల్ స‌భ‌లో జితేంద‌ర్‌రెడ్డి వ్యాఖ్య‌లు

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర పాల‌మూరు జిల్లాకు చేరింది. ఇవ్వాల మ‌క్త‌ల్‌లో జ‌రిగిన బ‌హిరంగ‌ స‌భ‌లో మాజీ ఎంపీ ఏపీ జితేంద‌ర్‌రెడ్డి ప్ర‌సంగించారు. పాల‌మూరు రైతులు గోస‌ప‌డుతున్నార‌ని, అప్పుడెప్పుడో భీమా1, భీమా2 ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు చేప‌డితే ఇప్ప‌టికీ ఇంకా ప‌నులు పూర్తి కాలేద‌ని టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం తీరుపై మండిప‌డ్డారు. అంతేకాకుండా పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌నులు చేప‌ట్టి చాలాకాల‌మైనా ఇప్ప‌టికీ ప‌నులు ముందుకు క‌ద‌ల‌డం లేదన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌ని, బండి సంజ‌య్ ముఖ్య‌మంత్రి అయితేనే రైతుల క‌ష్టాలు తీరుతాయ‌ని జితేంద‌ర్‌రెడ్డి అన్నారు.

మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్ప‌టికే బీజేపీలో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, ఎంపీ బండి సంజ‌య్ వ‌ర్గాలు పార్టీ మారింద‌ని, దీనికితోడు దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు కూడా త‌న‌కు పార్టీలో ఇంపార్టెన్స్ ఇవ్వ‌డం లేద‌ని అల‌క‌బూనిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.. జితేంద‌ర్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్య‌ల‌తో పార్టీలో క‌చ్చితంగా చీలిక వ‌స్తుంద‌ని.. ఇప్పుడు స్ప‌ష్టంగా పార్టీ రెండుగా విడిపోవ‌డం ఖాయ‌మంటున్నారు పొలిటిక‌ల్ అన‌లిస్టులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement