Monday, July 22, 2024

Wajedu – విధుల పట్ల అధికారుల నిర్లక్ష్యం – సమయపాలన పాటించని వైనం

వాజేడు మే 22 (ప్రభ న్యూస్) : మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలంలో పనిచేస్తున్న అధికారులువిధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు.సమయపాలన పాటించకుండా సుదూర ప్రాంతాల నుండి అప్ అండ్ డౌన్ చేస్తూ విధులకు ఇష్టం వచ్చిన సమయంలో హాజరు కావడంతో అధికారుల కోసం ప్రజలు పడిగా పులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు నూతనంగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేస్తామని చెబుతుంటే ఇక్కడి అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలుఅధికారుల కోసం గంటల తరబడి పడిగా అప్పులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఉదయం 11 గంటలు దాటిన మండల పరిషత్ , రెవిన్యూ అధికారులు విధులకు హాజరు కాకపోవడం గమన రూపం అధికారులు ఎవరూ రాకపోవడంతో ఈ రెండు కార్యాలయాల్లో కాలి కుర్చీలు దర్శనమిస్తున్నాయి .

- Advertisement -

సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వచ్చిన ప్రజలు అధికారుల రాక కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో తో పాటు ఏ ఒక్క అధికారి కూడా రాకపోవడంతో కార్యాలయం మొత్తం వెలవెలబోయింది. అదే పరిస్థితి రెవెన్యూ కార్యాలయంలో కూడా నెలకొంది. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన ఇక్కడే అధికారులు విధుల పట్ల ఇంతటి నిర్లక్ష్యం వహిస్తున్నారని మండల ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విధుల పట్ల వహించే నిర్లక్ష్యం వలన ప్రజా ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్పడం లేదు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement