Sunday, April 28, 2024

కాంగ్రెస్ మేధోమథనం.. 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్ కసరత్తు, మే 13 నుంచి చింతన్ శిబిర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు చేపట్టింది. మే 13, 14, 15 తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ‘చింతన్ శిబిర్’ నిర్వహించేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేసింది. వరుస పరాజయాలతో దిగాలుపడ్డ పార్టీకి పునరుజ్జీవం తీసుకొచ్చేందుకు నడుం బిగించింది. కాంగ్రెస్‌లో విస్తృతస్థాయి మేధోమథన కార్యక్రమమైన ‘చింతన్ శిబిర్’లో చర్చించేందుకు 6 అంశాలను అజెండాలో భాగం చేశారు. వాటిపై పత్రాలను సిద్ధం చేసి చర్చించేందుకు 6 ప్యానెళ్లను ఏర్పాటుచేస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. వీటిలో రాజకీయాంశాలపై ఏర్పాటు చేసిన ప్యానెల్‌లో టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు లభించగా, సామాజిక న్యాయం, సాధికారత ప్యానెల్‌లో కొప్పుల రాజుకు చోటు దొరికింది. ఆ ప్యానెళ్ల వివరాలు

రాజకీయాంశాలు

  1. మల్లికార్జున ఖర్గే – కన్వీనర్
  2. గులాం నబీ ఆజాద్
  3. అశోక్ చవాన్
  4. ఉత్తమ్ కుమార్ రెడ్డి
  5. శశి థరూర్
  6. గౌరవ్ గగోయ్
  7. సప్తగిరి శంకర్ ఉలాకా
  8. పవన్ ఖేరా
  9. రాగిణి నాయక్

సామాజిక న్యాయం, సాధికారత

  1. సల్మాన్ ఖుర్షీద్ – కన్వీనర్
  2. మీరా కుమార్
  3. దిగ్విజయ్ సింగ్
  4. కుమారి షెల్జా
  5. సుఖ్జీందర్ సింగ్ రంధావా
  6. నబం తుకీ
  7. నరన్‌భాయ్ రత్వా
  8. ఆంటో ఆంటోనీ
  9. కొప్పుల రాజు

- Advertisement -

ఆర్థిక వ్యవస్థ

  1. పి. చిదంబరం – కన్వీనర్
  2. సిద్ధరామయ్య
  3. ఆనంద్ శర్మ
  4. సచిన్ పైలట్
  5. మనీష్ తివారి
  6. ప్రొఫెసర్ రాజీవ్ గౌడ
  7. ప్రణితి షిండే
  8. ప్రొఫెసర్ గౌరవ్ వల్లభ్
  9. సుప్రియ శ్రీనాటే

సంస్థాగత వ్యవహారాలు

  1. ముకుల్ వాస్నిక్ – కన్వీనర్
  2. అజయ్ మాకెన్
  3. తారిఖ్ అన్వర్
  4. రమేశ్ చెన్నితల
  5. రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా
  6. అధిర్ రంజన్ చౌదరి
  7. నెట్టా డిసౌజా
  8. మీనాక్షి నటరాజన్

రైతులు, వ్యవసాయం

  1. భూపిందర్ సింగ్ హుడా – కన్వీనర్
  2. టీఎస్ సింగ్‌దేవ్
  3. శక్తి సింహ్ గోహిల్
  4. నానా పటోలే
  5. ప్రతాప్ సింగ్ భజ్వా
  6. అరుణ్ యాదవ్
  7. అఖిలేశ్ ప్రసాద్ సింగ్
  8. గీతా కోరా
  9. అజయ్ కుమార్ లల్లూ

యువత – సాధికారత

  1. అమరీందర్ సింగ్ వర్రింగ్ – కన్వీనర్
  2. బీవీ శ్రీనివాస్
  3. నీరజ్ కుందన్
  4. కృష్ణ బైరెగౌడ
  5. కృష్ణ అల్లవారు
  6. అల్కా లాంబ
  7. రోజీ ఎం. జాన్
  8. అభిషేక్ దత్
  9. కరిష్మా ఠాకూర్
  10. డా. అంకిత దత్తా
Advertisement

తాజా వార్తలు

Advertisement