Sunday, May 12, 2024

గాంధీలో నిండిన బెడ్స్ – అరచేతిలో ప్రాణాలు

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఘననీయంగా పెరుగుతుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గాంధీ హాస్పిటల్ లో కరోనా పేషెంట్ ల చేరిక అధికమవుతుంది. ప్రతి పదినిమిషాలకు ఓ కరోనా పేషెంట్ గాంధీ హాస్పిటల్ లో చేరుతున్నాడు. ఇప్పటికే గాంధీ లో వెంటిలేటర్ బెడ్స్ నిండిపోయాయి. దీనితో నాన్ కోవిద్ విభాగాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మరో వైపు ప్రైవేట్ హాస్పిటల్స్ లో బెడ్స్ నిండిపోయినట్టు తెలుస్తుంది.

ఇప్పటికే గాంధీ హాస్పిటల్ లో ఉన్న 550 ఆక్సిజన్ బెడ్స్ నిండిపోవడంతో 249 ప్రైవేట్ ఆస్పత్రులకు కరోనా ట్రీట్మెంట్ చేసేందుకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా 30, 20 పడకలతో ఉన్న చిన్నచిన్న హాస్పిటల్స్ లను తెలంగాణ వ్యాప్తంగా 1500 వరకు అధికారులు గుర్తించారు. ఆ హాస్పిటల్స్ లో పది, పదిహేను పడకలను కరోనా పేషెంట్స్ కు కేటాయించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోతే మాత్రం మున్ముందు ఈ పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement