Monday, April 29, 2024

TS | కేసీఆర్ పర్యటన భయంతో నంది పంప్ హౌస్‌ నుంచి నీళ్లు విడుదల : కేటీఆర్

నల్గొండ మండలం ముషంపల్లి గ్రామంలో రైతులు గన్నెబోయిన మల్లయ్య, బోర్ల రాంరెడ్డిలను పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలని… రిజర్వాయర్లలో నీళ్ళు నింపకుండా ఈ ప్రభుత్వం నాటకాలు ఆడింది. కానీ కేసీఆర్ పర్యటన భయంతో నంది పంప్ హౌస్‌లో ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి కరీంనగర్‌కు నీళ్లు వదిలారు. నిన్నటిదాకా కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పి.. కానీ ఇదే రోజు అదే బాహుబలి మోటార్లతో కరీంనగర్‌కు నీళ్లు అందిస్తున్నారు.

. కేసీఆర్ ఉన్నన్ని రోజులు నాగార్జునసాగర్ నుంచి మొదలుకొని… టేయిల్ ఎండ్ దాకా ప్రతి ఒక్కరికి సాగునీరు అందింది. గత పది సంవత్సరాలలో ఏనాడు ఒక బోరు వెయ్యాల్సిన పరిస్థితి రాలేదు. కానీ గత నాలుగు నెలల్లో ఆరు బోర్లు వేసిన పరిస్థితి ఉందని రాంరెడ్డి చెప్పారు

గన్నెబోయిన మల్లయ్య యాదవ్, బోర్ల రాంరెడ్డిల పరిస్థితి తెలుసుకున్న తరువాత మనసున్న ప్రతి ఒక్కరికీ బాధ కలుగుతుంది. అందుకే మల్లన్నను ప్రత్యేకంగా కలిసేందుకు ఇవాళ ముషంపల్లికి వచ్చినట్టు తెలిపారు.

రాంరెడ్డి అన్నను, మల్లన్నను కలిసినా, కొందరు మహిళలను కలిసినా.. గత పదేళ్లలో ఏ రోజూ తాగునీరు, సాగునీటికి కొరత రాలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పంటలు ఎండిపోయాయి. తాగునీరు దొరకని పరిస్థితి నెలకొందని అంటున్నట్టు కేటీఆర్ అన్నారు.

ఇది కాలంతో వచ్చిన కరువు కాదని, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని అందరూ అంటున్నారు. రాష్ట్ర మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంటే కరెంటు కోత లేదని, సాగునీటి కొరత లేదని రైతుల ముందుకు వచ్చి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. నేడు రైతాంగం పరిస్థితి అధ్వాన్నంగా ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు.

- Advertisement -

అధికారంలోకి వచ్చి నూట పది రోజులు కావస్తున్నా… నీళ్లు ఇవ్వలేని అసమర్థ పరిస్థితిని తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క కేసీఆర్‌పై దుష్ప్రచారం చేయాలనే దురుద్దేశంతో లక్షలాది మంది రైతుల పంటలను ఎండగట్టింది. ఎక్కడెక్కడ అయితే పంట నష్టం జరిగిందో అక్కడ ఎకరానికి రూ.25 వేల పంట నష్టం అందించాలి. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు.. కాంగ్రెస్ తెచ్చిన దుస్థితి.. కాబట్టి కాంగ్రెస్ వెంటనే పరిహారం చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement