Saturday, May 18, 2024

MI vs RR | నాలుగు ఓవ‌ర్ల‌లోనే కుప్పకూలిన ముంబై టాపార్డర్.. భారమంతా మిడిలార్డర్‌‌పైనే

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగుత్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు కష్టాల్లో పడింది. తొలి ఓవర్లలోనే కీలక బ్యాటర్లు అవుట్ అయ్యారు… నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్‌ జట్టు. రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ ముగ్గురు బ్యాటర్లు డ‌కౌట్‌ చేసి ముంబైని ఆదిలోనే దెబ్బ‌కొట్టాడు.

తొలి ఓవర్‌‌ ఐదో బంతికే రోహిత్ శ‌ర్మ‌(0)ను డ‌కౌట్‌గా వెన‌క్కి పంపాడు. ఆ త‌ర్వాత బంతికి న‌మ‌న్ ధిర్‌(0)ను ఎల్బీగా ఔట్ చేశాడు. మూడో ఓవర్ రెండో బంతికి డెవాల్డ్ బ్రెవిస్ (0) కూడా డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక నాలుగో ఓవర్ మూడో బంతికి నాంద్రే బర్గర్ బౌలింగ్‌ లో ఓపెనర్ ఇషాన్ కిష‌న్(16) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో తిలక్ వర్మ (21), హార్దిక్ పాండ్యా (20) ఉన్నారు. ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement