Monday, May 6, 2024

తక్షణమే శాంతి చర్చలకు రండి.. రష్యాకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సందేశం

తక్షణమే శాంతి చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి రష్యాను కోరారు. మాస్కోతో అర్థవంతమైన చర్చలకు సమయం ఆసన్నమైందని అన్నారు. తన స్వంత తప్పిదాల నుండి నష్టాన్ని తగ్గించు కోవడానికి రష్యాకు ఇదే ఏకైక అవకాశమని చెప్పారు. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. ఇప్పటికే భారీసంఖ్యలో సైనికులను కోల్పోయారు. ఆయుధ నష్టమూ వాటిల్లింది. ఇకనైనా వాస్తవం గ్రహించండి అని కోరారు. ‘మేము ఎల్లప్పుడూ చర్చల కోసం పట్టుబట్టాము. మేము సంభాషణను అందించాము. శాంతి కోసం పరిష్కారాలను అందించాము. ప్రతి ఒక్కరూ ఇప్పుడు నా మాట వినాలని నేను కోరుకుంటున్నాను. శాంతి కోసం, మన భద్రత కోసం చర్చలకు సమయం ఆసన్నమైంది.

ఉక్రెయిన్‌ విషయంలో సొంత తప్పిదాల నంచి నష్టాన్ని తగ్గించుకునేందుకు ఇదే అవకాశం. ఇది మనమిద్దరం కలిసే సమయం. మాట్లాడుకునే సమయం’ అని జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. ఈ యుద్ధం రష్యాకు ఆర్థికంగా భారీ నష్టాలను కలిగిస్తుంది. ఈ నష్టం నుంచి కోలుకోవడానికి కొన్ని తరాలు పడుతుంది. ఇది ఉక్రెయిన్‌కు ప్రాదేశిక సమగ్రతను, న్యాయాన్ని పునరుద్ధరిం చడానికి సమయం. లేకపోతే, రష్యా నష్టాలు చాలా పెద్దవిగా ఉంటాయి అని పుతిన్‌ను హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement