Thursday, May 23, 2024

ఇంపెల్లా సీపీతో హార్ట్‌ సర్జరీ.. విజయవంతంగా నిర్వహించిన కేర్‌ వైద్యులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ‘ఇంపెల్లా’ సీపీ పరికరాన్ని ఉపయోగించి సంక్లిష్టమైన గుండె బైపాస్‌ సర్జరీని బంజారాహిల్స్‌ కేర్‌ హాస్పిటల్‌ వైద్యులు విజయవంతంగా నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడారు. తమిళనాడు రాష్ట్రం, కడూరు జిల్లా, నెయ్‌వేలి గ్రామానికి చెందిన 70 ఏళ్ల వెంకట కృష్ణ తీవ్రమైన మయోకార్డియల్‌ డిస్‌ఫంక్షన్‌తో ప్రాణాపాయ స్థితిలో కేర్‌లో చేరారు. ఆయనకు సాధారణ బైపాస్‌ సర్జరీ చేసినా ప్రాణాపాయం పొంచి ఉండటంతో ఆసుపత్రి సీటీ సర్జరీ విభాగం డా. రామ సుబ్రహ్మణ్యం నూతన ప్రక్రియ ద్వారా బైపాస్‌ సర్జరీని నిర్వహించారు.

ఈ తరహా ఇంపెల్లా బైపాస్‌ సర్జరీ చాలా క్లిష్టమన్నారు. ఈ తరహా సర్జరీ ఆగ్నేసియాలోనే ప్రత్యేకమన్నారు. సర్జరీలో వైద్యులు.. వి. సూర్య ప్రకాశరావు, పిఎల్‌ఎన్‌ కపర్ధి, డాక్టర్‌ సునీల్‌ బబ్లూ పుల్లా, జ్యోతి, రాం రా#హుల్‌ అగర్వాల్‌, పవన్‌ కుమార్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం రోగి కోలుకున్నారని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement