Sunday, May 19, 2024

ఈ నెల 24న గ్రాండ్ రిలీజ్ కానున్న – చోర్ బ‌జార్

ఈ నెల 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది చోర్ బ‌జార్ చిత్రం. ఈ చిత్రంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ నటించాడు. ఈ చిత్రంలో గెహన సిప్పీ హీరోయిన్ గా నటించింది. ‘దళం’, ‘జార్జ్ రెడ్డి’ సినిమాలతో టాలీవుడ్ లో తనదైన మార్క్ ను క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా పాటలు హిట్ అయ్యాయి. వీటన్నింటి వల్ల ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. బిజినెస్ సర్కిల్ లో కూడా క్రేజ్ ఏర్పడింది. చోర్ బజార్’ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లూరి సురేశ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement