Thursday, May 2, 2024

ఏం స్కెచ్ రా..నా వీక్ నెస్ మీద దెబ్బ‌కొట్టారుగా – చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్

పోలీసుల‌కు..రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు నేను కోడి పందాలు ఆడుతాన‌ని తెలుస‌న్నారు టిడిపి మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్.ఆయ‌న కోడి పందాల కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పఠాన్ చెరువులో కోడి పందాలు నిర్వహించిన కేసులో చింతమనేని ప్రభాకర్ కూడా చిక్కుకున్నారు. అయితే.. ఈ కేసుపై చింతమనేని ప్రభాకర్ స్పందించారు. కోడిపందాలు నాకు చిన్నప్పటినుంచి వ్యసనమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడి పందాలు ఆడటం చట్ట విరుద్ధం, నా వీక్ నేస్ కొద్ది కోడి పందాలు ఆడటానికి వెళ్ళాననని.. స్కెచ్ లో భాగంగా నన్ను కోడిపందాల వద్దకు తీసుకెళ్లారని పేర్కొన్నారు టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. కోడి పందాల వద్ద పోలీసులే నాకు సమాచారం ఇచ్చి అక్కడ నుంచి తప్పించారన్నారు. పోలీసులు వచ్చినపుడు నేను అక్కడ లేనని క్లారిటీ ఇచ్చారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement