Friday, May 17, 2024

ఏఐఏడీఎంకే నేత ఆర్ కామరాజ్‌.. ఇంట్లో ఏసీబీ దాడులు

తమిళనాడు మాజీ మంత్రి, ఏఐఏడీఎంకే నేత ఆర్ కామరాజ్‌ ఇంట్లో, అలాగే ఆయన సన్నిహితులకు చెందిన 49 చోట్ల విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామరాజ్‌ను, మరొక ఐదుగురిని నిందితులుగా పేర్కొన్నారు. కామరాజ్ 2015-2021 మధ్య కాలంలో ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ కాలంలో ఆయన తన ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించారని ఏసీబీ ఆరోపించింది. ఆయన ఆదాయానికి మించి రూ.58 కోట్లు సంపాదించినట్లు ఆరోపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement