Tuesday, April 30, 2024

Breaking: మదర్సాలలో చదువులే పిల్లలను హంతకులను చేస్తున్నాయి.. రివ్యూ చేయాలన్న గవర్నర్​

మదర్సాలలో నేర్పే పాఠాలే ముస్లిం పిల్లలను నేర ప్రవృత్తిలోకి నెట్టివేస్తున్నాయని, అందులో భాగంగానే ఉదయ్​పూర్​ వంటి దారుణాల జరుగుతున్నాయని కేరళ గవర్నర్​ ఆరిఫ్​ మహ్మద్​ఖాన్ అన్నారు​. ఉదయ్‌పూర్ శిరచ్ఛేదం కేసుపై బుధవారం స్పందిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.. మదర్సాలలో దైవదూషణ చేసిన వారికి శిక్షగా శిరచ్ఛేదం చేయాలని పిల్లలకు బోధిస్తున్నారని, అందువల్లే ఇట్లాంటి దారుణాలు చూడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.

మదర్సాలలో వారికి ఇది దేవుని చట్టంగా బోధిస్తున్నారు.ఈ బోధనలను తప్పకుండా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు కేరళ గవర్నర్​. ఇట్లాంటి లక్షణాలతోనే నేటి తరం యువత మదర్సాల నుంచి బయటికి వస్తోందని, దీనికి తాము చింతిస్తున్నట్టు తెలిపారు. ఇట్లాంటి ఘటనలు జరగకుండా మదర్సాలలో నేర్పే పాఠాలపై రివ్యవూ చేయాల్సి అవసరం ఉందని, పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మంగళవారం ఉదయ్‌పూర్‌లో పట్టపగలు ఓ దుకాణదారుడు హత్యకు గురైన సంఘటన దేశవ్యాప్తంగా ఉద్రిక్తతకు దారితీసింది. కన్హయ్య లాల్ అనే దుకాణదారుని ఇద్దరు వ్యక్తులు అతని తల నరికి చంపారు. తర్వాత నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వ్యక్తిని చంపినట్లు అంగీకరించిన వీడియోను రికార్డ్ చేశారు.

కాగా, ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఇద్దరిని మంగళవారం రాత్రి రాజ్‌సమంద్ జిల్లాలోని భీమ్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకురాలు నుపుర్ శర్మకు మద్దతుగా దుకాణదారుడి ఎనిమిదేళ్ల కుమారుడు పెట్టిన పోస్ట్ ను అనుసరించి ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement