Tuesday, April 23, 2024

ఎంపీ వద్దిరాజుతో మెడికల్, హెల్త్ డైరెక్టర్ భేటీ

ఖమ్మం : రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనందుకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో అమలవుతున్న సేవలు, పలు పథకాల గురించి ఎంపీ వద్దిరాజుకు వివరించారు. ఈ భేటీలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement