Sunday, April 28, 2024

ప్లే స్టోర్ లో చాట్ జీపీటీ.. ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానున్న ఏఐ

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించడంతో చాట్ బోట్ అతి త‌క్కుక కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఒపేన్ ఏఐ కంపెనీ అబివృద్ధి చేసిన ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏకంగా 100 మిలియన్ల యూజర్లతో ఇంటర్నెట్ ను షేక్ చేసింది. మొదట వెబ్ అప్లికేషన్ గా మాత్రమే ప‌రిచ‌యమైన ఈ ఏఐ టూల్.. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

వచ్చే వారం గూగుల్ ప్లే స్టోర్ లో అధికారికంగా లాంఛ్ కానుంది. కాగా, ఇప్పటికే ఈ యాప్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. కాగా, ఈ ఏడాది మే లోనే చాట్ జీపీటీ ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆండ్రాయిడ్ యూజర్లు కూడాఈ యాప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎదురుచూసున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement