Tuesday, April 30, 2024

పెళ్లి పీటలెక్కనున్న చాహర్‌

టీమిండియా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ పేసర్‌ దీపక్‌ చాహర్‌ అతి త్వ‌రలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు జయ భరదాజ్‌ను జూన్‌ 1న పెళ్లి చేసుకోబోతున్నాడు. గతేడాది ఐపీఎల్‌ చివరి మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ జయకు అందరి ముందు ప్రపోజ్‌ చేసిన విషయం తెలిసిందే. జయ భరద్వాజ్‌.. ఢిల్లికి చెందిన అమ్మాయి. ఓ కార్పొరేట్‌ కంపెనీలో పని చేస్తున్నది. ఇక దీపక్‌ – జయ పెళ్లి విషయాన్ని చాహర్‌ తండ్రి తో కేంద్ర సింగ్‌ చాహర్‌ ప్రకటించారు. దీపక్‌ కొంత కాలంగా స్నేహితురాలికి ప్రపోజ్‌ చేశాడని, అందుకు 2021 ప్లే ఆఫ్స్‌ దశలో అలా చేయాలని చూశాడన్నాడు.

కానీ సీఎస్‌కే కెప్టెన్‌ ధోనీ సలహా మేరకు పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన సీఎస్‌కే చివరి లీగ్‌ మ్యాచ్‌లోనే దీపక్‌.. జయకు ప్రపోజ్‌ చేశాడని వివరించారు. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో జూన్‌ 1న పెళ్లి నిశ్చయించినట్టు తెలిపాడు. 2022 ఐపీఎల్‌ మెగా వేలంలో.. చాహర్‌ను సీఎస్‌కే రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. వెన్నులో గాయం కారణంగా బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో కోలుకుంటున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement