Friday, April 26, 2024

Silence: హారన్ మోగిందో ఇక చాలాన్ ప‌డిన‌ట్టే.. హైద‌రాబాద్‌లో కొత్త రూల్స్‌

హైద‌రాబాద్ సిటీని శబ్దకాలుష్యం నుంచి విముక్తి చేయ‌డానికి ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేప‌ట్టారు. అధిక శబ్దాలు, ఒళ్లు జలదరించే హారన్లు వినియోగించే వారిపై కేంద్ర మోటారు వాహనాల చట్టం-1989 కింద రూ.1000 జరిమానాతోపాటు కేసు నమోదు చేయనున్నారు. ఈ మేరకు జూన్‌ 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేప‌ట్ట‌నున్న‌ట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈనెల 10వ తేదీ నుంచి హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భారీ శబ్దాలు వచ్చే 3,320 హారన్లను కూడా రిమూవ్ చేశారు. వాహన కంపెనీ తయారు చేసిన హారన్‌ కాకుండా ఇతర హారన్లు ఉపయోగిస్తే అట్లాంటి వారిపై కేసు నమోదుతో పాటు చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్న‌ట్టు తెలిపారు. హారన్‌తోపాటు సైరన్‌ ఉపయోగించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామ‌ని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement