Monday, May 6, 2024

మైత్రీ మూవీ సంస్థపై కేంద్ర జీఎస్‌టీ శాఖ దాడులు.. 15చోట్ల ఏకకాలంలో సోదాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రముఖ సీనీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థకుౖ ఊహించని షాక్‌ తగిలింది. సంస్థ కార్యాలయాలపై సోమవారం ఉదయం కేంద్ర జీఎస్‌టీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు కొనసాగించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు, సిబ్బందికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగాయి. నిర్మాతలు నవీన్‌ యర్నేని, రవిశంకర్‌ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. లావాదేవీలు, ఆదాయపన్ను చెల్లింపులపై ఆరా తీశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ లావాదేవీలు, సినిమా బడ్జెట్‌కు సంబంధించిన లెక్కలు సరిగా చూపలేదని జీఎస్‌టీ అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

అగ్రహీరోలు, భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ వరుస సినిమాలను నిర్మిస్తోంది. చిత్ర నిర్మాణాలకు సంబంధించిన పన్ను చెల్లింపులు తదితర అంశాలపై వివిధ పత్రాలను అధికారులు పరిశీలించారు. ఈ సంస్థ గతంలో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, సర్కారు వారిపాట, పుష్పది రైజ్‌ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం ఆ సంస్థే వాలేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలను నిర్మించింది. సంక్రాంతికి ఆ రెండు సినిమాలు విడుదల కానున్నాయి. నిన్న ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ప్రారంభించింది. అల్లు అర్జున్‌తో పుష్ప చిత్రాన్ని నిర్మించింది. తాజాగా పుష్ప-2 చిత్రీకరణను ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement