Monday, April 29, 2024

సుప్రీంకోర్టులో కేసుల పరిష్కారం తర్వాత గిరిజన రిజర్వేషన్లపై నిర్ణయం.. బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అత్యున్నత న్యాయస్థానంలో కేసులు పరిష్కారమయ్యాక గిరిజన రిజర్వేషన్లపై ముందుకు వెళ్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గిరిజన రిజర్వేషన్లు పది శాతం పెంచాలని పార్లమెంట్ వేదికగా బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్‌సభలో డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్లపై అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా రాతపూర్వక సమాధానమిచ్చారు.

తెలంగాణాలో గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్రప్రభుత్వానికి అందిందని తెలిపారు. రిజర్వేషన్లను పది శాతానికి పెంచాలని కోరుతూ తెలంగాణా ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్ర హోం శాఖకు చేరిందన్నారు. రిజర్వేషన్లకు సంబంధించిన కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో వున్నాయని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement