Friday, April 26, 2024

లాభాల బాట పట్టిన సెంట్రల్‌ బ్యాంక్‌…

ప్రభుత్వ రంగంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ310 కోట్ల లాభం గడించింది. రాని బాకీలను కూడా తక్కువ స్థాయిలోనే చూపించింది. సోమవారం నాడు బ్యాంక్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదలయ్యాయి. గత సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సెంట్రల్‌ బ్యాంక్‌ రూ. 1,349 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2022 ఆర్థిక సంవత్సరం నాల్గవ క్వార్టర్‌లో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ. 6,419.58 కోట్లకు చేరుకున్నది.

నిరుడు ఇదే సమయానికి బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ. 5,729 కోట్లు మాత్రమే. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ లాభాల పట్టింది. దాదాపు రూ. 1,045 కోట్ల లాభాన్ని గడించింది. 2020-21లో రూ.888 కోట్ల నష్టం వచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.25,770.13 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు సంవత్సరం ఇది రూ.25,845 కోట్లు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement